తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఉప్పెన' సెట్​లో కొరటాల-ఆహాలో 'తెల్లవారితే గురువారం' - tellavaritey guravaram movie in aha ott platform

'ఉప్పెన' చిత్రానికి సంబంధించిన మరో మేకింగ్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో దర్శకుడు కొరటాల శివ కనిపించారు. 'తెల్లవారితే గురువారం' సినిమా ఏప్రిల్‌ 16న ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో విడుదల కానుంది.

uppena
ఉప్పెన

By

Published : Apr 12, 2021, 4:35 PM IST

వైష్ణవ్‌ తేజ్‌, కృతి శెట్టి జంటగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర మేకింగ్‌ వీడియోల్ని సినీ అభిమానులకు కానుకగా అందిస్తున్నారు దర్శకనిర్మాతలు. తెర వెనక జరిగిన విషయాల్ని ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే పాటలు, సన్నివేశాలకు సంబంధించిన మేకింగ్‌ వీడియోలు విడుదలకాగా తాజాగా 'మస్ట్‌ వాచ్‌ ఉప్పెన మేకింగ్‌' పేరిట మరో వీడియోను అందించారు. విజయ్‌ సేతుపతి పాత్రను తెరకెక్కించేందుకు ఎంత కష్టపడ్డారో ఈ వీడియోలో చూడొచ్చు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఉప్పెన సెట్‌లో అడుగుపెట్టిన జ్ఞాపకాన్ని ఈ వీడియోలో చూపించారు. కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌ సెట్లో క్రికెట్‌ ఆడుతూ సందడి చేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ దీన్ని చూసేయండి...

ఓటీటీ వేదికపై సినిమా ప్రేక్షకులను అలరించేందుకు మరో చిత్రం సిద్ధమైంది. శ్రీసింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'తెల్లవారితే గురువారం'. ఏప్రిల్‌ 16న ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'లో విడుదల కానుంది. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్‌ కనకాల, సత్య, అజయ్‌, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.

ఇదీ చూడండి:'జల జల జలపాతం' పాట ఎలా తీశారంటే?

ABOUT THE AUTHOR

...view details