తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థియేటర్లలోనే సల్మాన్​, రణ్​వీర్, అక్షయ్ సినిమాలు - ranveer 83 release date

అగ్రహీరోలు సల్మాన్ ఖాన్, రణ్​వీర్ సింగ్, అక్షయ్ కుమార్​ల కొత్త సినిమాలు అన్ని థియేటర్లలోనే విడుదల కానున్నాయి. ఈ మేరకు ఆయా చిత్రబృందాలు ప్రకటనలు చేశాయి.

updates of salman radhe, akshay kumar sooryavanshi, ranveer 83
థియేటర్లలోనే సల్మాన్​, రణ్​వీర్, అక్షయ్ సినిమాలు

By

Published : Nov 20, 2020, 3:42 PM IST

బాలీవుడ్​ నుంచి కొత్త వార్తలు వచ్చాయి. సల్మాన్​ఖాన్ 'రాధే'తో పాటు రణ్​వీర్-దీపిక నటించిన '83', అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' విడుదలపై స్పష్టత వచ్చింది.

థియేటర్లలోనే భాయ్ సినిమా

'రాధే' సినిమా నేరుగా ఓటీటీలో రానుందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టిన చిత్రబృందం.. థియేటర్లలోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. వచ్చే ఈద్​ కానుకగా రానుంది. ఇందులో సల్మాన్​ సరసన దిశా పటానీ హీరోయిన్. ప్రభుదేవా దర్శకుడు.

రాధే సినిమాలో సల్మాన్​ఖాన్

మార్చి 31లోపు విడుదల

లాక్​డౌన్ ప్రభావంతో వాయిదాలు పడుతూ వస్తున్న రణ్​వీర్ సింగ్ '83', అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ' సినిమాలు.. వచ్చే ఏడాది మార్చి 31లోపు థియేటర్లలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇంకా రిలీజ్​ డేట్స్​ను ఖరారు చేయలేదని తెలిపారు.

రణ్​వీర్ సింగ్ '83', అక్షయ్ కుమార్ 'సూర్యవంశీ'

ABOUT THE AUTHOR

...view details