*స్టార్ హీరోయిన్ రష్మిక నటించిన ఆల్బమ్ సాంగ్ 'టాప్ టక్కర్'.. సోమవారం(ఫిబ్రవరి 8) విడుదల కానుంది. ఇందులో బాద్షా, యువన్ శంకర్ రాజా కూడా కనిపించనున్నారు.
*శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన 'జాంబీ రెడ్డి'.. వసూళ్లలో దూసుకెళ్తోంది. రెండో రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.4.63 కోట్లు సాధించినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఫ్యాక్షనిస్టులు జాంబీలు అయితే ఏం జరిగింది అనే కథతో ఈ సినిమా తెరకెక్కించారు.
*అమితాబ్-అజయ్ దేవ్‌గణ్ 'మేడే' సినిమా షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. అందుకు సంబంధించిన ఓ ఫొటో లీకైంది. పైలట్ దుస్తుల్లో అజయ్, సూట్లో బిగ్‌బీ కనిపించారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తోంది.
మేడే సినిమాలో అజయ్ దేవ్‌గణ్, అమితాబ్ బచ్చన్ *విక్రమ్ 'కోబ్రా' సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. శనివారం ఆమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించారు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఇందులో ప్రతినాయక లక్షణాలున్న పాత్ర పోషించారు.
కోబ్రా సెట్లో శ్రీనిధి శెట్టి