తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కేజీఎఫ్​ 2' టీజర్​పై క్లారిటీ.. 'శ్యామ్​ సింగరాయ్​' సెట్లో నాని - తమన్నా వార్తలు

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. 'శ్యామ్​ సింగరాయ్​' చిత్రీకరణలో నాని పాల్గొనగా.. 'కేజీఎఫ్​ 2' టీజర్​ విడుదల తేదీపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చేసింది. అలాగే ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్స్​ సాధించిన దక్షిణాది నటుడిగా సూపర్​స్టార్ మహేశ్​బాబు రికార్డు సాధించారు.

Updates From 'KGF 2', 'Syam Singaroy' movies And Tamannah Birthday special
'కేజీఎఫ్​ 2' టీజర్​పై క్లారిటీ.. 'శ్యామ్​ సింగరాయ్​' సెట్లో నాని

By

Published : Dec 21, 2020, 12:02 PM IST

  • రెండేళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన 'కేజీఎఫ్​: ఛాప్టర్​ 1' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర సీక్వెల్​కు సంబంధించిన కొత్త అప్​డేట్​ను సోమవారం చిత్రబృందం ప్రకటించింది. హీరో యశ్​ పుట్టినరోజైన జనవరి 8న ఉదయం 10.18 గంటలకు 'కేజీఎఫ్​: ఛాప్టర్​ 2' టీజర్​ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
  • నేచురల్​ స్టార్​ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'శ్యామ్​ సింగరాయ్​'. ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్​లో సోమవారం నాని అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిత్రీకరణలో పాల్గొన్న ఫొటోను సోషల్​మీడియాలో పంచుకున్నారు.
  • స్టార్​ హీరోయిన్​ తమన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తోన్న 'సీటీమార్​', 'గుర్తుందా శీతాకాలం', 'ఎఫ్​ 3' చిత్రాల నుంచి కొత్త లుక్​లు విడుదల అయ్యాయి. ఆమె పోస్టర్లను విడుదల చేస్తూ.. చిత్రబృందాలు శుభాకాంక్షలు తెలియజేశాయి.
  • సోషల్​మీడియాలో చురుకుగా ఉండే సూపర్​స్టార్ మహేశ్​బాబు ఓ రికార్డును సొంతం చేసుకున్నారు. ట్విట్టర్​లో ఎక్కువ మంది ఫాలోవర్స్​ ఉన్న దక్షిణాది హీరోగా మహేశ్​ ఘనత సాధించారు. ఇప్పుడు ట్విట్టర్​లో మహేశ్​ను అనుసరించే వారి సంఖ్య 11 మిలియన్లకు పెరిగింది.
    'కేజీఎఫ్​ 2' టీజర్​ రిలీజ్​ పోస్టర్​
    'శ్యామ్​ సింగరాయ్​' షూటింగ్​లో పాల్గొన్న నాని
    'సీటీమార్​' చిత్రంలో తమన్నా లుక్​
    'గుర్తుందా శీతాకాలం'లో తమన్నా ఫస్ట్​లుక్​ పోస్టర్​
    'గుర్తుందా శీతాకాలం'లో తమన్నా ఫస్ట్​లుక్​ పోస్టర్​
    తమన్నాకు శుభాకాంక్షలు తెలిపిన 'ఎఫ్​ 3' చిత్రబృందం
    ట్విట్టర్​లో 11 మిలియన్ల ఫాలోవర్స్​ మైలురాయిని చేరుకున్న మహేశ్​

ABOUT THE AUTHOR

...view details