*వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'గని' చివరి షెడ్యూల్ షురూ అయింది. బాక్సింగ్ నేపథ్య కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. త్వరలో విడుదల తేదీ గురించి వెల్లడించే అవకాశముంది.
*'లక్ష్య' చిత్రం కూడా చివరి షెడ్యూల్లో అడుగుపెట్టింది. ఈ విషయాన్నే చెబుతూ ఓ వీడియోను పోస్ట్ చేశారు హీరో నాగశౌర్య. విలువిద్య(ఆర్చరీ) కథతో తెలుగులో తీస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో నాగశౌర్య సిక్స్‌ప్యాక్‌తో కనిపించనున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు.