తెలంగాణ

telangana

By

Published : Dec 19, 2020, 5:25 AM IST

ETV Bharat / sitara

భయపెడుతున్న 'జాంబీ' ట్రైలర్.. తెలుగులోకి 'బోగన్'

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'బోగన్', 'జి-జాంబీ', 'వ్యూహం' చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

updates from bhogan release date, z-zombie trailer, vyuham release
భయపెడుతున్న 'జాంబీ' ట్రైలర్.. తెలుగులోకి 'బోగన్'

>అరవింద్ స్వామి, జయం రవి, హన్సిక నటించిన చిత్రం 'బోగన్'. తమిళంలో విజయవంతమైన ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో జనవరి 1న విడుదల చేయనున్నారు. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

>'జి-జాంబీ' సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఓ ప్రయోగం వికటించి, కొందరు మనుషులు జాంబీలుగా మారితే ఏం జరిగింది? తర్వాతి పరిణామాలు ఏంటి? అనే కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేశారు. రాజ్, దివ్య హీరోహీరోయిన్లుగా నటించారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

>మలయాళ హీరో టొవినో థామస్​ నటించిన మరో సినిమాను 'ఆహా'లో విడుదల చేయనున్నారు. 'ఒరు కుప్రా దిశ పయ్యన్' చిత్రాన్ని 'వ్యూహం' పేరుతో ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇది చదవండి:మెగాఫ్యామిలీ నుంచి మరొకరు.. హీరోగా హాస్యనటుడు

ABOUT THE AUTHOR

...view details