దసరాకు బాలయ్య సందడి చేయనున్నారా! ఆయన జోరు చూస్తుంటే ఖాయమనే అనిపిస్తోంది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అఖండ' చిత్రీకరణ కొన్నాళ్లుగా శరవేగంగా సాగుతోంది. సోమవారం వరకు రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మంగళవారంతో టాకీభాగం సన్నివేశాల్ని పూర్తి చేశారు. రెండు పాటలు మాత్రమే తెరకెక్కించాల్సి ఉందని సినీ వర్గాలు తెలిపాయి. మరో పక్క నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే 'అఖండ' సందడి దసరా పండగకు రావడం దాదాపు లాంఛనమే.
శరవేగంగా 'అఖండ' షూటింగ్.. దసరాకే రిలీజ్! - అఖండ సినిమా
'అఖండ' చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. మంగళవారంతో టాకీభాగం సన్నివేశాల్ని పూర్తి అయ్యాయి. మరోవైపు.. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే 'అఖండ' సందడి దసరాకు ఖాయమనేలా కనిపిస్తోంది.
శరవేగంగా 'అఖండ' షూటింగ్.. దసరాకే రిలీజ్!
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. విజయవంతమైన 'సింహా', 'లెజెండ్' తర్వాత వస్తున్న సినిమా కావడం వల్ల అభిమానులు మరింత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ఆయనకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, పూర్ణ నటించారు. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత.
ఇదీ చదవండి :ఇంద్రజ కోసం కోర్టులో కేసు వాదించి గెలిచిన స్టార్ హీరో ఎవరు?