కరోనా పరిస్థితులను దాటుకొని తెలుగు తెరపై చిన్న చిత్రాల సందడి కొనసాగుతోంది. థియేటర్లు ప్రారంభించి దాదాపు నెలరోజులు దాటింది. ఇప్పటివరకు యువ కథానాయకులు, చిన్న బడ్జెట్ సినిమాలే వెండితెరపై సందడి చేశాయి. ఈ పరంపర సెప్టెంబరులోనూ కొనసాగనుంది. మరోవైపు కొన్ని చిత్రాలు ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరి సెప్టెంబరు మొదటి వారంలో థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలేవో (New movies) చూసేయండి.
'101 జిల్లాల అందగాడు..' కానీ అసలు సమస్య అదే!
వైవిధ్య కథలు, పాత్రలతో అలరించే యువ నటుల్లో అవసరాల శ్రీనివాస్ ఒకరు. తాజాగా ఆయన బట్టతలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం '101 జిల్లాల అందగాడు'. రుహానీ శర్మ కథానాయిక. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్‌లలో విడుదల కానుంది.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. పెళ్లికాక ముందే బట్టతల రావడం వల్ల అది కనిపించకుండా గొత్తి సత్యనారాయణ అనే యువకుడు విగ్గు పెట్టుకుంటాడు. అది చూసి అందరూ అతడిది నిజమైన జుట్టు అనుకుంటారు. ఒక అమ్మాయి కూడా ప్రేమలో పడుతుంది. బట్టతల కనపడనీయకుండా చేసేందుకు సత్యనారాయణ చేసిన ప్రయత్నాలు ఏంటి? తెలిసిన తర్వాత ఆ అమ్మాయి అతడిని ప్రేమించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి క్రిష్ సమర్పిస్తున్నారు.
డియర్ ప్రేమకథ
మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'డియర్ మేఘ'. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్ దాస్యన్ నిర్మించారు. భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
అనుభూతికి గురిచేసే ఓ మంచి ప్రేమకథతో ఈ చిత్రం రూపొందిందని, ప్రతి ఒక్కరినీ హత్తుకునేలా భావోద్వేగాలు ఉంటాయని నిర్మాతలు చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభించింది. 300 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. హరి గౌర ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
వినోదాత్మక చిత్రం 'అప్పుడు ఇప్పుడు'
సుజన్, తనీష్క్ జంటగా చలపతి పువ్వల తెరకెక్కించిన చిత్రం 'అప్పుడు ఇప్పుడు'. ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణంరాజు నిర్మించారు. శివాజీ రాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ చక్కటి వినోదాత్మక చిత్రమిదని, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని దర్శకుడు చలపతి తెలిపారు.
క్రైమ్ థ్రిల్లర్ ఈ 'కిల్లర్'
కార్తీక్ సాయి, డాలీ షా, నేహా దేశ్‌పాండే కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ది కిల్లర్'. చిన్నా దర్శకత్వం వహిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాదవ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసుదేవరావు నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ వాట్కిన్స్ సంగీతం అందిస్తున్నారు.
'అశ్మీ' కథ ఏంటి?