తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే!

ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తన్న విక్టరీ వెంకటేశ్ 'దృశ్యం 2' సినిమా ఈ వారమే విడుదలకానుంది. ఇక సూపర్​ స్టార్ రజనీ కాంత్ నటించిన పెద్దన్న ఇదివరకే థియేటర్లలో సందడి చేయగా, ఈ వారం ఓటీటీలోకి రానుంది. దాంతో పాటు సల్మాన్​ ఖాన్, రాజ్​ తరుణ్ వంటి హీరోల కొత్త చిత్రాలతో పాటు ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఏంటో చూడండి.

movies releasing this week
దృశ్యం 2

By

Published : Nov 23, 2021, 9:17 AM IST

గతవారం పలు చిన్న చిత్రాలు(Tollywood) వెండితెరపై సందడి చేశాయి. ఇక ఈ వారం (movies releasing this week) అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు(telugu Movies) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఆ చిత్రాలు, వాటి సంగతులు.. ఎప్పుడెప్పుడు వస్తున్నాయో చూసేద్దామా!

'అనుభవించు రాజా' అంటున్న రాజ్‌ తరుణ్‌

యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో అలరిస్తున్న యువ కథానాయకుడు రాజ్‌తరుణ్‌. ఆయన కీలక పాత్రలో శ్రీను గావిరెడ్డి తెరకెక్కించిన చిత్రం 'అనుభవించు రాజా'. ఉభయ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కషికా ఖాన్‌ కథానాయిక. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లు అందులోని సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గోపీ సుందర్‌ స్వరాలు అందిస్తున్నారు. నవంబరు 26న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.

సంపూ మార్కు కామెడీ కథ 'క్యాలీఫ్లవర్‌'

సంపూర్ణేష్‌ బాబు కథానాయకుడిగా ఆర్కే మలినేని తెరకెక్కించిన వినోదాత్మక చిత్రం 'క్యాలీఫ్లవర్‌'. శీలో రక్షతి రక్షితః.. అన్నది ఉపశీర్షిక. ఆశా జ్యోతి గోగినేని నిర్మించారు. వాసంతి కథానాయిక. పోసాని కృష్ణమురళి, పృధ్వీ కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబరు 26న థియేటర్లలో విడుదల కానుంది.

'లూప్‌'లో చిక్కుకుపోయింది ఎవరు?

'లూప్'

తమిళంతో పాటు, తెలుగులోనూ గుర్తింపు ఉన్న నటుడు శింబు. వినూత్నమైన సినిమాలు చేస్తూ దక్షిణాదిలో ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ తమిళ స్టార్‌హీరో ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో అలరించేందుకు సిద్ధమయ్యాడు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన తమిళ చిత్రం 'మానాడు'. తెలుగులో దీన్ని 'ది లూప్‌' పేరుతో నవంబరు 25న థియేటర్‌లలో విడుదల చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. కల్యాణి ప్రియదర్శన్ కథానాయిక. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

1997లో ఏం జరిగింది?

1997

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన '1997'ను నవంబరు 26న థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'పీకే'గా మారిన షకలక శంర్‌

కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు షకలక శంకర్(shakalaka shankar)‌. అంతేకాదు, ఆయన కథానాయడిగానూ తనదైన ముద్రవేశారు. తాజాగా ఆయన కీలక పాత్రలో సంజయ్‌ పునూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కార్పొరేటర్‌'(corporator). సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినోదంతో పాటు, రాజకీయ సందేశంతో కూడిన చిత్రంగా 'కార్పొరేటర్‌' తెరకెక్కినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.

వాస్తవ ఘటనల ఆధారంగా.. 'ఆశా ఎన్‌కౌంటర్‌'

యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్‌ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం 'ఆశ ఎన్‌కౌంటర్‌'. 2019 నవంబర్‌ 26న హైదరాబాద్‌ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్‌ చంద్ర 'ఆశ ఎన్‌కౌంటర్‌' తెరకెక్కించారు. నవంబర్‌ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించారు

'భగత్‌ సింగ్‌ నగర్‌'లో ఓ ప్రేమకథ

'భగత్‌ సింగ్‌ నగర్‌'

విదార్థ్‌, ధృవీక జంటగా వాలాజా క్రాంతి తెరకెక్కిస్తున్న చిత్రం 'భగత్‌ సింగ్‌ నగర్‌'. వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 26న థియేటర్స్‌లో విడుదల కానుంది. భగత్‌ సింగ్‌ రాసిన ఓ లైన్‌ను ఆదర్శంగా తీసుకొని.. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం తెలిపింది.

హైవోల్టేజ్‌ యాక్షన్‌ హంగామా 'సత్యమేవ జయతే2'

'సత్యమేవ జయతే2'

జాన్‌ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం 'సత్యమేవ జయతే'. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా 'సత్యమేవ జయతే 2' వస్తోంది. కొన్ని నెలలుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు వచ్చే నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిలాప్‌ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్‌ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్‌ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు.

పోలీస్‌ కథతో 'అంతిమ్‌' అంటున్న సల్మాన్‌

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అంతిమ్: ది ఫైనల్‌ ట్రూత్‌'. ఆయుష్‌ శర్మ కీలకపాత్ర పోషించాడు. మహేశ్‌ వి.మంజ్రేకర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 26న థియేటర్‌లలో విడుదల కానుంది. ఇందులో సల్మాన్‌ పోలీసు అధికారిగా కనిపించారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రం షూటింగ్‌ కేవలం 60 రోజుల్లోనే పూర్తి చేయడం విశేషం.

ఈసారి ఓటీటీలో అలరించే చిత్రాలివే!

కుటుంబం కోసం మరోసారి రాంబాబు ఏం చేశాడు?

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'దృశ్యం-2'. 2014లో వచ్చిన 'దృశ్యం' చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. థియేటర్స్‌లో విడుదల కావాల్సిన 'దృశ్యం2' ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. నవంబర్‌ 25న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళంలో 'దృశ్యం-2' తెరకెక్కించిన జీతూ జోసఫ్‌ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. నదియా, నరేశ్‌, సంపత్‌ రాజ్‌, తనికెళ్ల భరణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.

'పెద్దన్న' వచ్చేస్తున్నాడు

'పెద్దన్న'

రజనీకాంత్‌ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ మసాలా ఎంటర్‌టైనర్‌ 'పెద్దన్న'. నయనతార కథానాయిక. కీర్తి సురేశ్‌ కీలక పాత్ర పోషించింది. అన్నా, చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో శివ ఈ సినిమాను తీర్చిదిద్దారు. దీపావళి కానుకగా థియేటర్‌లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు సన్‌నెక్ట్స్‌, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. నవంబరు 26న తెలుగు వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రావటం దాదాపు ఖాయం.

ఈ ఓటీటీలో 'రొమాంటిక్‌'

'రొమాంటిక్'

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'రొమాంటిక్‌'. కేతిక శర్మ కథానాయిక. అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించారు. అక్టోబరు 29న థియేటర్లలో విడుదలై యువతను అమితంగా ఆకర్షించిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ప్రముఖ ఓటీటీ 'ఆహా'లో ఈనెల 26 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, ఉత్తేజ్‌, రమాప్రభ, దేవయాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందించారు.

యువ కలెక్టర్‌ కథ 'రిపబ్లిక్‌' కూడా..

'రిపబ్లిక్'

యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌గా నటించిన చిత్రం 'రిపబ్లిక్‌'. అక్టోబరు 1న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమం వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ 'జీ 5'లో నవంబరు 26 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రమ్యకృష్ణ, ఐశ్వర్య రాజేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీ స్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

అవికాగోర్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రల్లో నటించిన 'బ్రో' చిత్రం సోనీలివ్‌లో నవంబరు 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

'బ్రో'

ఓటీటీలో వచ్చే మరికొన్ని చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • కొట్టిగొబ్బ3(కన్నడ) నవంబరు 23
  • చ్చోరీ(హిందీ) నవంబరు 26

నెట్‌ఫ్లిక్స్‌

  • ట్రూ స్టోరీ(హాలీవుడ్‌) నవంబరు 24
  • బ్రూయిజ్‌డ్‌(హాలీవుడ్‌) నవంబరు 24
  • ఏ కాజిల్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌)నవంబరు 26

డిస్నీ+ హాట్‌స్టార్‌

  • 2024(హిందీ) నవంబరు 23
  • హాకేయ్‌ (తెలుగు డబ్బింగ్‌) నవంబరు 24
  • దిల్‌ బెకరార్‌ (వెబ్‌ సిరీస్‌) నవంబరు 26

సోనీ లివ్‌

  • శివరంజనీయుమ్‌ ఇన్నుం శిల పెంగాళుమ్‌(తమిళం) నవంబరు 26

ఇదీ చూడండి:'వెంకటేశ్​కు రేచీకటి.. వరుణ్​ తేజ్​కు నత్తి'

ABOUT THE AUTHOR

...view details