తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా థియేటర్‌లో విడుదలవుతున్న (tollywood upcoming movies) సినిమాల సంఖ్య పెరగడం శుభపరిణామం. ముఖ్యంగా దసరా నవరాత్రి ఉత్సవాలు, సెలవుల నేపథ్యంలో కొత్త సినిమాలు సందడి చేసేందుకు (tollywood upcoming films) సిద్ధమవుతున్నాయి. ఈసారి కాస్త మంచి గుర్తింపు ఉన్న కథానాయకులు వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విడుదలై థియేటర్‌లో అలరించిన పలు చిత్రాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు కూడా ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించే (tollywood upcoming releases) ఆ చిత్రాలేంటో చూసేద్దామా!
గతవారం అన్న.. ఈ వారం తమ్ముడు..
గతవారం 'రిపబ్లిక్'తో ప్రేక్షకులను పలకరించారు సాయితేజ్. ఈ వారం ఆ సినీ సందడిని ఆయన సోదరుడు వైష్ణవ్‌తేజ్ (telugu movies 2021) కొనసాగించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్, రకుల్ జంటగా నటించిన చిత్రం 'కొండపొలం' (kondapolam movie). అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్‌లలో విడుదల కానుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన 'కొండపొలం' నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. గొర్రెల కాపరిగా, ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మగా రకుల్ అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం బాగుంది. ఈ ఏడాది 'ఉప్పెన'తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్‌తేజ్ 'కొండపొలం'లో ఎలా అలరిస్తారో చూడాలి!
ఎట్టకేలకు వస్తున్న 'ఆరడుగుల బుల్లెట్'
గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం 'ఆరడుగుల బుల్లెట్' (aaradugula bullet). బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల ఇంతకాలం విడుదలకు నోచుకోలేదు. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. జయబాలాజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మించారు.
'నేను లేని.. నా ప్రేమకథ' అంటున్న నవీన్ చంద్ర
నవీన్‌చంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం 'నేను లేని నా ప్రేమకథ'. గాయత్రి ఆర్.సురేష్, అదితి మ్యాకల్ కథానాయికలు. సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించారు. కల్యాణ్ కందుకూరి, నిమ్మకాయల దుర్గాప్రసాద్‌రెడ్డి, అన్నదాత భాస్కర్‌రావు నిర్మాతలు. "మనసుల్ని హత్తుకునే ప్రేమకథ ఇది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కరోనా విరామం సమయంలో ఈ చిత్రానికి దర్శకుడు ప్రత్యేకంగా మెరుగులు దిద్దారు. రాంబాబు గోసాల పాటలు, ఎన్.కె.భూపతి కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం" అని చిత్ర బృందం ఇటీవల తెలిపింది. అక్టోబరు 8న ఈ సినిమా థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తుపాకీ పట్టిన వైద్యుడు 'వరుణ్ డాక్టర్'
తమిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్. ఆయన నటించిన పలు సినిమాలు అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన తాజా మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ (varun doctor) 'వరుణ్ డాక్టర్'. ప్రియాంక అరుళ్ మోహన్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అక్టోబరు 9న ఈ సినిమాను థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు ఓ డాక్టర్ ఏం చేశాడు? ఎవరెవరి సాయం తీసుకున్నాడు? చివరకు అమ్మాయిలను కిడ్నాప్ చేసే ముఠా ఆటకట్టించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!