తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చైతూ ఓకే.. మరి మిగతా హీరోల పరిస్థితి! - బెల్లంకొండ శ్రీనివాస్

ఎప్పటి నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న నలుగురు యువ హీరోలు...ఏప్రిల్​లో సినీ పరీక్షకు సిద్ధమయ్యారు. 'మజిలీ'తో నాగచైతన్య పాసయ్యాడు. మరి మిగతా ముగ్గురు కథానాయకుల పరిస్థితి ఏంటి..?

చైతూ ఓకే.. మరి మిగతా హీరోల పరిస్థితి

By

Published : Apr 9, 2019, 4:30 PM IST

ఐపీఎల్.. ఎన్నికల హడావుడి..మండుతున్న ఎండలు. వీటన్నింటి నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త సినిమాలు. ఎప్పటి నుంచో హిట్​ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ యువ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది ఈ నెలలోనే. ఇప్పటికే నాగచైతన్య 'మజిలీ' పాజిటివ్ టాక్​తో దూసుకెళ్తోంది. త్వరలో రాబోతున్న ఆ మిగతా ముగ్గురి పరిస్థితి ఏంటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

తేజ్ 'చిత్రలహరి' అలరించేనా

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది మెగా హీరో సాయిధరమ్ తేజ్ గురించి. అతడు నటించిన 'చిత్రలహరి' ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై భారీ ఆశలే పెట్టుకున్నాడీ కథానాయకుడు. ఇప్పటికే 'తిక్క', 'విన్నర్', 'నక్షత్రం', 'జవాన్', 'ఇంటెలిజెంట్', 'తేజ్ ఐ లవ్ యూ' చిత్రాలతో ఫ్లాఫు​ల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఈ సారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని పట్టుదలగా ఉన్నాడు. అందుకే గడ్డం పెంచాడు, పేరు మార్చుకున్నాడు.

ఇదీ చదవండి: 'గడ్డం పెంచా.. పెద్ద హిట్ కొడతా' అంటున్న సాయిధరమ్ తేజ్

కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటించారు. సునీల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.

క్రికెటర్​ అర్జున్ 'జెర్సీ'తో హిట్ కొట్టేనా

టాలీవుడ్​లో విభిన్న చిత్రాలు చేయడంలో ముందుండే నటుడు నాని. కానీ అతడు నటించిన చివరి రెండు సినిమాలు 'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్'... బాక్సాఫీస్​ దగ్గర బోల్తా కొట్టాయి. జాగ్రత్త పడిన నాని.. క్రికెట్ నేపథ్యంతో సాగే 'జెర్సీ' కథాంశాన్ని ఎంచుకున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్​, పాటలు సినిమాపై అంచనాల్ని పెంచుతున్నాయి. ఏప్రిల్ 19న రానుందీ సినిమా. ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతుండటం, క్రికెటర్​గా నటించడం ఈ హీరోకు కలిసొస్తుందేమో చూడాలి.

ఇది చదవండి: నాని.. క్రికెటర్​ అర్జున్​గా మారాడిలా...

బెల్లంకొండకు 'సీత' అదృష్టం కలిసొచ్చేనా

తొలి సినిమా 'అల్లుడు శీను'తో ఓ మోస్తరు హిట్ అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. తర్వాత వచ్చిన చిత్రాల్లో 'జయ జానకి నాయక' మినహా మరే చిత్రం ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఎప్పటి నుంచో భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడీ హీరో. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో 'సీత' సినిమాలో నటించాడు. ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా కనిపించనుంది. ఏప్రిల్ 25న వస్తున్న ఈ చిత్రమైనా అతడికి హిట్ ఇస్తుందేమో చూడాలి.

ఇది చదవండి: 'బుల్లెట్'​ పాటలో మెరిసిన పాయల్ రాజ్​పుత్

వేసవి సినిమా సందడిలో మొదటగా వచ్చిన నాగచైతన్య.. 'మజిలీ'తో దూసుకుపోతున్నాడు. మరి మిగతా ముగ్గురూ అదే వేగాన్ని అందుకుంటారా.. ? లేదా.. ? అనేది చూడాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details