తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Lady Orientated Movies: జోరు మీదున్న హీరోయిన్లు - vidya balan sherni

ఒకప్పుడు అడపాదడపా తెరకెక్కే మహిళా శక్తిని చాటే సినిమాలు ప్రస్తుత కాలంలో జోరుగా రూపొందుతున్నాయి. కథానాయకులకు పోటీగా విభిన్న కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు నాయికలు. దీంతో వారి చిత్రాలకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న హిందీ లేడి ఓరియెంటెడ్​ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

Lady orientated movies
లేడి ఓరియేంటెడ్​​​ మూవీస్​

By

Published : Jun 15, 2021, 8:20 AM IST

వివాదాలతోపాటు విభిన్న పాత్రలకూ కంగనా చిరునామా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'తలైవి'. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా తెర కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. మణికర్ణిక తర్వాత కంగనా నటిస్తున్న సినిమా ఇది. దీంతో పోస్టర్ విడుదలైనప్పటి నుంచే అంచనాలు పెరిగాయి.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాకు తెలుగులో విజయేంద్ర ప్రసాద్ రచనా సహకారం అందిస్తున్నారు. రూ.65 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఏప్రిల్​లోనే విడుదల కావాల్సి ఉంది. లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది. ఓటీటీలో విడుదలవుతుందని వార్తలొచ్చిన చిత్రబృందం వాటిని తోసిపుచ్చింది. జయలలిత 16 నుంచి 60 ఏళ్ల వరకు జీవితాన్ని ఇందులో చూపించనున్నారట. ఎంజీఆర్​గా అరవిందస్వామి నటించారు.

తలైవి

విద్యాబాలన్​.. షేర్నీ..

కథా బలమున్న వాటికి ప్రాధాన్యమిచ్చే నాయికగా విద్యాబాలన్​కు పేరు. ఇప్పుడు 'షేర్నీతో' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విద్యా ఫారెస్ట్ ఆఫీసర్ గా కనిపించనుంది. మనుషులను చంపుతున్న పులిని పట్టుకునే బృందానికి ఈమె నాయకురాలు. మహిళ కావడం వల్ల ఆమె పని తీరుపై పై అధికారులు సందేహం వ్యక్తం చేసే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంది. విద్యా కాస్త విరామం ఇచ్చి వస్తుండటం, ట్రైలర్​ను చూసేటప్పుడే ధైర్యంగా చూడండని చెప్పడం సినిమాపై అంచనాలు పెంచే సింది. కథ వినగానే తెగ నచ్చేసిందనీ.. విద్యగా తన పాత్రలో భిన్న కోణాలుంటాయనీ ఆమె చెబుతోంది. మనిషికీ జంతువుకే కాదు, మనుషుల మధ్యా పరస్పరం ఉండాల్సిన గౌరవ భావం, అర్ధం చేసుకునే తత్వం వంటి సున్నిత అంశాలనూ దీనిలో టచ్ చేశారట. ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్ విడుదల కానుంది.

షేర్ని

గంగూబాయ్​గా అలియా

భిన్న పాత్రలపై అలియా చాలా త్వరగానే దృష్టి పెట్టింది. తన గత సినిమాలను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్ ప్రారంభంలోని బేబీ డాల్ ఇమేజ్​ను పూర్తిగా చెరిపేసుకుంది. 'కథియవాడ గంగూబాయ్' నిజజీవిత ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఎస్. హుస్సేన్ ఖైదీ రచించిన 'మాఫియా క్వీన్ ఆఫ్ ముంబయి' అనే పుస్తకం ఆధారంగా తీస్తున్నారు. కథియవాడకు చెందిన గంగా అనే సాధారణ యువతి గత్యంతరం లేక వ్యభిచారంలోకి అడుగుపెట్టి, అక్కడ్నుంచి గంగూబాయ్ గా ఎలా ఎదిగిందన్నది కథ. మహిళా సాధికారతకు ప్రతిరూపంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక పాత్రలో కనిపించడం, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం అంచనాలను పెంచేశాయి. జులైలో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

గంగూబాయ్​

రెండు బయోపిక్​లు

మహిళా ప్రాధాన్యమున్న సినిమాలకు తాప్సీ కేరాఫ్ అడ్రస్​గా మారిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఆమెవి క్రీడా నేపథ్యంలో రెండు సినిమాలు రానున్నాయి. క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత నేపథ్యంలో 'శభాష్ మిథూ', స్ర్పింటర్​ 'రష్మి రాకెట్' సినిమాలు ప్రేక్షకులు ముందుకు రానున్నాయి. కొలోజియమ్ మీడియా, వయాకామ్18 సంయుక్తంగా నిర్వహిస్తున్న శభాష్ మిధూకి రాహుల్ డొలాఖియా దరకత్వం వహిస్తున్నారు. మీథాలీ పాత్రలో తాప్సీ చక్కగా ఇమిడిందంటూ అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. పల్లెటూరి అమ్మాయి జాతీయస్థాయి స్పింటర్​గా ఎదిగిన వైనం 'రష్మి రాకెట్'లో కనిపిస్తుంది. ఈ సినిమా కోసం తాప్సీ బోలెడు కసరత్తులనూ చేసింది. ఆకర్ష్​ ఖురానా దీనికి దర్శకుడు.

రష్మి రాకెట్​

ఇదీ చూడండి: Kamal Hassan: 'దశావతారం' చిత్రానికి ఇన్ని కష్టాలా?

ABOUT THE AUTHOR

...view details