తెలంగాణ

telangana

ETV Bharat / sitara

విజయ్ దేవరకొండతో బాలయ్య కిక్​ బాక్సింగ్​.. అదరగొట్టేశారుగా! - unstoppable

Unstoppable with NBK: 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' షోలో బాలయ్య సందడి మాములుగా లేదు. 'లైగర్​' టీమ్​ ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా హీరో విజయ్​ దేవరకొండతో బాక్సింగ్​ చేశారు బాలకృష్ణ. అందుకు సంబంధించిన ప్రోమో యమా ఆకట్టుకుంటోంది.

Unstoppable with NBK
Vijay Devarakonda

By

Published : Jan 10, 2022, 9:17 PM IST

Unstoppable with NBK: యువ హీరో విజయ్ దేవరకొండతో కిక్​ బాక్సింగ్ చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇది జరిగింది బాక్సింగ్​ రింగ్​లో కాదు. బాలయ్య 'అన్​స్టాపబుల్​' షోలో. ఈ షోకు 'లైగర్'​ టీమ్​ హాజరైంది. సమరసింహా రెడ్డి వెల్​కమ్స్​ అర్జున్​ రెడ్డి.. అంటూ విజయ్​ని సాదరంగా ఆహ్వానించారు బాలయ్య.

అంతకుముందు మాటల గన్​ అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్​ను పొగిడారు బాలకృష్ణ. పూరికి ఇద్దరు ముగ్గురు గర్ల్​ఫ్రెండ్స్ ఉన్నారంటూ ఆటపట్టించారు. నిర్మాత ఛార్మి కూడా ఈ షోలో సందడి చేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఆహా ఓటీటీలో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది.

ఇదీ చూడండి:సోషల్ మీడియాలో రూమర్స్.. బాలయ్య ఫైర్

ABOUT THE AUTHOR

...view details