తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒకే వేదికపై చిరు-బాలయ్య.. ఫ్యాన్స్​కు పండగే! - అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే

మెగాస్టార్​ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకే వేదికపై సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు వీరితో పాటు రామ్​చరణ్​ కూడా పాల్గొంటారని సమాచారం.

Unstoppable With NBK: Balakrishna To Interact With Chiranjeevi And Ram Charan?
ఒకే వేదికపై చిరంజీవి-బాలయ్య.. ఫ్యాన్స్​కు పండగే!

By

Published : Oct 12, 2021, 4:25 PM IST

నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా.. ప్రముఖ డిజిటల్​ ప్లాట్​ఫామ్​ 'ఆహా'(OTT Platform Aha) ఓ టాక్​ షో(Balakrishna talk show) నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే'(Unstoppable With NBK) అని నామకరణం చేశారు. ఈ టాక్​ షోలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొననున్నారు. అయితే ఇందులోని తొలి ఎపిసోడ్​లో మంచు మోహన్​బాబు అతిథిగా రానున్నారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ షోకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు టాలీవుడ్​లో చక్కర్లు కొడుతోంది.

ఈ కార్యక్రమానికి తొలి ఎపిసోడ్​లో అతిథిగా మెగాస్టార్​ చిరంజీవి సందడి చేయనున్నారని సమాచారం. ఆయనతో పాటు హీరో రామ్​చరణ్​ కూడా ఈ షోలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో(Ram Charan Chiru Movie) చిరు-చరణ్​ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న(Acharya Movie Release Date) విడుదల కానుంది. ఈ చిత్ర విడుదలకు ముందు బాలయ్య టాక్​షోలో మెగా హీరోలు సందడి చేయనున్నారని తెలుస్తోంది.

ఇదీ చూడండి..ఓటీటీలో బాలయ్య.. హోస్ట్​గా రచ్చ రచ్చే!

ABOUT THE AUTHOR

...view details