Unstoppable With NBK: రూమర్స్‌కు సోషల్ మీడియా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎవరుపడితే వారు సామాజిక మాధ్యమాల్లో ఇష్టమొచ్చిన రాతలు రాయడం ఫ్యాషన్ అయిపోతుంది. తాజాగా ఈ విషయమై స్పందించారు నటసింహం నందమూరి బాలకృష్ణ. పేరు లేకుండా, సరైన అడ్రస్ ఇవ్వకుండా ఇలా రూమర్స్ క్రియేట్ చేసేవారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
'ఆహా' వేదికగా ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' కార్యక్రమంలో భాగంగా రూమర్స్ చేసే వారిపై కీలక వ్యాఖ్యలు చేశారు బాలయ్య. "రవితేజకు, బాలకృష్ణకు పడదు. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు. నా హీరో తోపు .. నీ హీరో సోపు" ఇలాంటి మాటలేంటి అని అన్నారు. "లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయింది.. దొరికితే దవడ పగిలిపోద్ది" అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అయితే.. ఈ ఊరు, పేరు చెప్పుకోలేని, ధైర్యంలేని వెధవల్ని క్షమించి వదిలేయాలని కూడా అన్నారు బాలయ్య. మనపై వచ్చే విమర్శలను ప్రేమించినప్పుడే మనం అన్‌స్టాపబుల్ అవుతామని పేర్కొన్నారు.