తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆహా' అనిపించేలా బాలయ్య 'సింహా' సీన్ రిపీట్! - బాలకృష్ణ ఓటీటీలో

'ఆహా' వేదికగా(unstoppable with nbk aha) ప్రసారం కానున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' టాక్​ షోకు సంబంధించిన కొత్త ప్రోమో త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. తొలి(balakrishna on aha) ప్రోమోను డైరెక్ట్​ చేసిన ప్రశాంత్​ వర్మ.. బాలకృష్ణకు సంబంధించిన ఓ కొత్త లుక్​ను పోస్ట్​ చేశారు. అది చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు.

balayya
బాలయ్య

By

Published : Oct 17, 2021, 7:28 PM IST

హీరో బాలకృష్ణ()unstoppable with nbk aha) త్వరలోనే(నవంబరు 4) 'ఆహా' వేదికగా 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' టాక్​ షోతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలై ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకుంది(balakrishna on aha). ముఖ్యంగా.. బాలయ్య స్టైలిష్​ లుక్​, 'కలుద్దాం ఆహాలో' అంటూ ఆయన చెప్పిన డైలాగ్​​ అదిరిపోయాయి. అయితే ఇప్పుడు ఈ షోకు సంబంధించిన మరో కొత్త ప్రోమోను(balakrishna promo) విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

తొలి ప్రోమోకు దర్శకత్వం వహించిన ప్రశాంత్​ వర్మ చేసిన తాజా ట్వీట్​ చూస్తే ఇది అర్థమవుతోంది. సెట్స్​లో బాలయ్యతో దిగిన ఓ ఫొటోను పోస్ట్​ చేశారు. 'ఆయన ఎనర్జీతో ఎవరూ పోటీ పడలేరు' అని క్యాప్షన్ జోడించారు. ఇందులో బాలయ్య లుక్.. గతంలో 'సింహా' సినిమాలోని(balakrishna simha photos) ఆయన మాస్​లుక్​​ను తలపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్​గా మారింది.

త్వరలోనే బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ'(akhanda movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలకృష్ణ(Balakrishna Latest Movie Updates) రెండు పాత్రల్లో సందడి చేయనున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మాత. ప్రగ్యా జైస్వాల్‌ కథానాయిక. పూర్ణ, శ్రీకాంత్‌(akhanda srikanth look) కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details