లైంగిక వేధింపుల కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాధారాలతో మరింత చిక్కులు ఎదుర్కోనున్నాడు హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్. నేడు విచారణలో భాగంగా ఫిర్యాదుదారు ఓ ఈ మెయిల్‌కు సంబంధించిన డాటాను న్యాయస్థానానికి అందజేసినట్లు తెలుస్తోంది. అందులో హాలీవుడ్ నటి జెన్నిఫర్ అనిస్టన్‌ను చంపాలని వెయిన్‌స్టీన్ చెప్పినట్లు ఉందట. 2017లో వెయిన్‌స్టీన్ ఓ మీడియా ప్రతినిధితో ఈ మాటలు చెప్పినట్లు తెలుస్తోంది.
తాజాగా సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం త్వరలో తీర్పు వెలువరించనుంది. అమెరికాలోని మీడియా కథనాల ప్రకారం ఇతడికి 5 నుంచి 27 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశముందని సమాచారం.