మోహన్‌బాబు ఇంటికెళ్లి బెదిరించిన దుండగులు - మోహన్‌బాబు వార్తలు
22:13 August 01
మోహన్‌బాబు ఇంటికెళ్లి బెదిరించిన దుండగులు
సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద కలకలం రేగింది. మోహన్ బాబు ఇంట్లోకి ఓ గుర్తు తెలియని కారు దూసుకెళ్లింది. కారులో ఉన్నవారు ఆయనను హెచ్చరించి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆందోళన చెందిన మోహన్ బాబు కుటుంబ సభ్యులు పహాడి షరీఫ్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో ఇంటి కాపలాదారు అప్రమత్తంగా లేనట్లు తెలిసింది.
ఏపీ 31 ఏ వన్ 0004 ఇన్నోవా కారులో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినట్లు సమాచారం. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయిలు ఎవరైన కావాలనే ఇలా చేశారా లేక నిజంగానే మోహన్ బాబు కుటుంబానికి హాని కలిగించే ఉద్దేశంతో ఎవరైనా ఈ పనికి పూనుకున్నారా అన్న విషయంపై లోతుగా ఆరా తీస్తున్నారు.