ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు పొందింది 'మనీ హైస్ట్'. ఇప్పటివరకు నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఐదో సీజన్(money heist season 5)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 3న(money heist season 5 release date) ఈ చివరి సీజన్ మొదటి భాగం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసిన ఈ సిరీస్ పేరే వినిపిస్తోంది. ఎవరు మాట్లాడుకున్నా.. వారి నోటి నుంచి ప్రొఫెసర్, టోక్యో, బెర్లిన్ పేర్లే వినబడుతున్నాయి. మరి ఈ సిరీస్‌కు మీరు కూడా బిగ్గెస్ట్ ఫ్యానా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి.
స్పెయిన్‌లో ఫ్లాప్
నిజానికి నెట్‌ఫ్లిక్స్‌లో మనీ హైస్ట్ విడుదలకావడానికి ముందే స్పెయిన్‌లో 2017లో ఆంటెనా అనే ఛానెల్లో ప్రసారమైంది. మొదటి ఎపిసోడ్ 4.5 మిలియనన్ల వీక్షణలతో టాప్‌లో నిలిచింది. కానీ ఆ తర్వాత ఈ సిరీస్ టీఆర్పీ తగ్గుతూ వచ్చింది. అందువల్ల ఈ సిరీస్‌ను అర్ధాంతరంగా నిలిపివేశారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ కొనుగోలు చేసే వరకు ఈ సిరీస్ ఫ్లాప్ అనే చిత్రబృందం భావించింది. నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేశాక ఈ సిరీస్ ఆదరణ అమాంతం పెరిగిపోయింది. అయితే ఈ ఓటీటీ కోసం 15 భాగాలుగా ఉన్న సిరీస్‌ను 22 చిన్న ఎపిసోడ్లుగా విడదీశారు. ఇక అప్పటినుంచి ఈ సిరీస్‌కు ఫ్యాన్‌బేస్ పెరుగుతూ వచ్చింది. ఒక్క సీజన్ కాస్తా ఇప్పుడు ఐదు సీజన్ల వరకు చేరింది.
దొంగతనాలకు స్ఫూర్తిగా..
యూరప్‌లోనే కాక ఉత్తర అమెరికాలోని చాలాచోట్ల కొందరు దొంగలు బొమ్మ మాస్క్‌లు ధరించి దొంగతనాలు చేశారు. వీరు ఇలా దొంగతనం చేసే సమయంలో బెల్లి సియో అనే పాట పాడేవారు. 2020లోనూ బ్రెజిల్‌లోని ఓ పట్టణంలో డాలి మాస్క్ ధరించిన కొందరు దొంగతనం చేసిన తర్వాత రోడ్లపై నోట్లను విసిరేస్తూ తప్పించుకున్నారు. ఈ సీన్ మనకు మనీ హైస్ట్లోనూ తారసపడుతుంది.
ఆ బంగారు ఖజానా నిజమే
ఈ సిరీస్‌లో చూపించే బంగారు ఖజానా నిజమైందే. ఇది ఓ స్పెయన్ బ్యాంక్‌లో ఉంది. ఒకవేళ ఆ ఖజానాలో ఎవరైనా సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే ఆ గదిలోకి నీరు వరదలా చేరుతుంది. ఇది సెక్యూరిటీ కోసం చేసిన ఓ వినూత్న ఆలోచన. అలా ఈ సీన్ కోసం మెరైన్ ఇంజినీర్ సహాయం తీసుకుంది చిత్రబృందం. కానీ నిజంగా ఆ ఖజానాను దొంగలించాలంటే రిస్క్ చాలా ఎక్కువ.
ఒరిజినల్ స్క్రిప్ట్‌లో నైరోబి పాత్ర లేదు
ఏదైనా సినిమాలో లేదా సిరీస్‌లో ఓ పాత్ర చనిపోతే బాధపడతాం. ఈ క్యారెక్టర్ మళ్లీ తిరిగొస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ ఎంతో ధైర్యవంతమైన, బలమైన, ప్రేరణ కలిగించే నైరోబి పాత్ర లేకుండా మనీ హైస్ట్ సిరీస్(money heist cast)ను ఊహించగలమా!. ముందుగా ఈ సిరీస్‌లో ఒక మహిళ పాత్ర మాత్రమే అనుకున్నారు దర్శకుడు అలెక్స్ పినా. అదీ టోక్యో పాత్ర. ఆ తర్వాత ఆయన ఇంతకుముందు లాక్డ్ అప్ కోసం పనిచేసిన అల్బా ఫ్లోరిస్తో ఈ రెండో పాత్ర గురించి వివరించారు. అది కాస్తా ఫ్లోరిస్కు నచ్చడం వల్ల నైరోబి (money heist nairobi) పాత్ర పుట్టుకొచ్చింది.
ఫుట్‌బాలర్ నెయ్మర్ ప్రత్యేక పాత్ర
బ్రెజిల్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు నెయ్మర్ (money heist neymar scene) ఈ సిరీస్‌లో ప్రత్యేక పాత్ర పోషించాడని తెలుసా?. అవును సీజన్ 3 లో ఇతడు అతిథి పాత్రలో కనిపిస్తాడు. ఈ సిరీస్‌కు నెయ్మర్ పెద్ద ఫ్యాన్. అందుకే చిత్రబృందాన్ని రిక్వెస్ట్ చేసి మరీ ఈ పాత్ర చేశాడు.