తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టాప్​ హీరోయిన్​తో​ త్వరలో పోలీస్​ సినిమా'

బాలీవుడ్​లో మహిళా పోలీస్​ కథతో త్వరలో సినిమా రానుందని చెప్పాడు హీరో అజయ్ దేవగణ్. హీరోయిన్​గా దీపికా పదుకొణే, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లేదా మరెవరైనా నటించే అవకాశముందని చెప్పాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించనున్నాడు.

'టాప్​ హీరోయిన్​తో​ త్వరలో పోలీస్​ సినిమా'

By

Published : May 20, 2019, 7:12 PM IST

'సింగం' సిరీస్​లో కథానాయకుడిగా నటించి ఆకట్టుకున్నాడు అజయ్ దేవగణ్. ఇటీవలే 'దేదే ప్యార్​ దే' సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు. త్వరలో హీరోయిన్​ ప్రధానంగా పోలీస్​ చిత్రం రాబోతుందని, రోహిత్​ శెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడని చెప్పాడీ హీరో. దీపికా పదుకొణే, కరీనా కపూర్​ లేదా కత్రినా కైఫ్ ఈ పాత్రలో కనిపించే అవకాశముందన్నాడు.

భవిష్యత్తులో బాలీవుడ్​లో యూనివర్స్​ సినిమాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పాడు హీరో అజయ్ దేవగణ్. 'అవెంజర్స్:ఎండ్​గేమ్'​ లాంటి సినిమాల్ని బాలీవుడ్​లో తెరకెక్కిస్తే ప్రేక్షకుల్ని అలరిస్తాయని పేర్కొన్నాడు.

అజయ్ దేవగణ్

"యూనివర్స్​ సినిమాలు రానున్న రోజుల్లో బాలీవుడ్​ను అలరించనున్నాయి. అగ్ర హీరోలు ఒక సినిమాలో కనిపిస్తే అభిమానులందరూ ఆ చిత్రానికి వెళ్తారు. ఇలాంటివి బాలీవుడ్​లో రావాలంటే సరైన స్క్రిప్ట్​ ముఖ్యం." -అజయ్ దేవగణ్, బాలీవుడ్​ హీరో

ప్రస్తుతం చారిత్రక నేపథ్యమున్న 'తానాజీ'లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు అజయ్ దేవగణ్. వచ్చే ఏడాది జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది. భారతీయ దిగ్గజ ఫుట్​బాల్​ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్​లోనూ నటిస్తున్నాడు. టాలీవుడ్​లో ప్రఖ్యాత దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'లో కీలక పాత్రలో కనిపించనున్నాడీ నటుడు.

ABOUT THE AUTHOR

...view details