తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బన్నీ 21వ చిత్రంపై క్లారిటీ వచ్చేసింది - Clarity On Allu Arjun 21 Movie

అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' అనే సినిమా తెరకెక్కుతున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే వేణు 'వకీల్ సాబ్​'తో బిజీ కావడం వల్ల బన్నీ సినిమాపై కొన్ని అనుమానాలు రేకెత్తాయి. తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది.

బన్నీ
బన్నీ

By

Published : Apr 8, 2020, 5:54 PM IST

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు కథానాయకుడు అల్లు అర్జున్‌. ఇప్పుడీ ఉత్సాహంలోనే సుకుమార్‌ దర్శకత్వంలో ఓ బహుభాషా చిత్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈరోజు బన్నీ పుట్టినరోజు పురస్కరించుకుని దీనికి 'పుష్ప' అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇది తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.

ఈ బర్త్‌డే కానుకగానే బన్నీ తర్వాతి చిత్రానికి సంబంధించి ఓ స్పష్టత వచ్చేసింది. అతడు తన 21వ చిత్రాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్‌తో చేయనున్నాడు. 'ఐకాన్‌' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన గతంలోనే వచ్చింది. కానీ ఆ తర్వాత వేణు.. పవన్‌ కల్యాణ్‌తో 'వకీల్‌సాబ్‌' చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతలు అందుకోవడం వల్ల ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయిందని అంతా భావించారు. తాజాగా స్టైలిష్‌స్టార్‌ బర్త్‌డే సందర్భంగా 'ఐకాన్‌' బృందం 'ఏఏ21' పేరుతో పోస్టర్‌ను విడుదల చేసింది. ఫలితంగా దీనిపై ఉన్న ఊహాగానాలన్నీ తొలగిపోయాయి. ఇది కూడా బహుభాషా చిత్రంగా రూపొందనున్నట్లు సమాచారం.

ఐకాన్

ABOUT THE AUTHOR

...view details