బాలల హక్కులను పరిరక్షించేందుకు ఇప్పటికే యునిసెఫ్ రాయబారిగా సేవలందిస్తోంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. తాజాగా యునిసెఫ్ తరపున మరో బాలీవుడ్ నటుడు పనిచేయనున్నాడు. చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు గళం విప్పనున్నాడు హీరో ఆయుష్మాన్ ఖురానా. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఐరాసలో అంతర్భాగమైన యునిసెఫ్‌తో పాటు భారత ప్రభుత్వంతో చేతులు కలిపాడు.
చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు ఏర్పాటు చేసిన పోక్సో చట్టానికి ప్రచారం కల్పించనున్నాడు ఆయుష్మాన్. ఈ మేరకు కేంద్ర మహిళ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ బాలీవుడ్ నటుడి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానుంది.