తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రియాంక చోప్రా 'అన్​ఫినిష్డ్' పూర్తి - priyanka chopra biography

తన జీవిత విశేషాలతో పుస్తకం రాస్తున్న నటి ప్రియాంక చోప్రా.. అది పూర్తయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈమె పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ప్రియాంక చోప్రా 'అన్​ఫినిష్డ్' పూర్తి
నటి ప్రియాంక చోప్రా

By

Published : Aug 12, 2020, 7:34 AM IST

హిందీలో అగ్రతారగా కొనసాగుతూ హాలీవుడ్​కు వెళ్లి అక్కడా సత్తా చాటుతున్న భామ ప్రియాంక చోప్రా. ఆమె తన జీవిత జ్ఞాపకాలతో 'అన్​ ఫినిష్డ్' పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఆ బుక్​ రాయడం పూర్తయినట్లు వెల్లడించింది.

ప్రియాంక చోప్రా 'అన్​ఫినిష్డ్' పుస్తకం

"అన్ ఫినిష్డ్' పూర్తయింది. కేవలం తుదిమెరుగులు దిద్దడమే మిగిలుంది. ఈ పుస్తకంలోని ప్రతి పదం నా జీవితాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. దీనిని మీతో పంచుకోవాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను" -ప్రియాంక చోప్రా ట్వీట్

ప్రియాంక ఓ టెలివిజన్ సిరీస్​ కోసం అమెజాన్ స్టూడియోస్ ఇప్పటికే​ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. నెట్​ఫ్లిక్స్​ సంస్థతో 'ఉయ్ కెన్ బీ హీరోస్', 'ది వైట్ టైగర్' చిత్రాలు చేస్తుంది. మిండీ కాలింగ్​తో ఓ వెడ్డింగ్ కామెడీలో నటిస్తోంది. వీటితో పాటే 'మాట్రిక్స్ 4' సినిమాతోనూ సందడి చేయనుంది.

ABOUT THE AUTHOR

...view details