ఓటీటీ వేదికలపై కొత్త సినిమాల జోరు కనిపిస్తోంది. తాజాగా మరో చిత్రం విడుదల ఖరారైంది. 'బాహుబలి' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తర్వాత శోభూ యార్లగడ్డ నిర్మించిన సినిమా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..'. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించారు. 'కేరాఫ్ కంచరపాలెం' ఫేం వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు.
ఓటీటీ వేదికగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' - ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వార్తలు
సత్యదేవ్ ప్రధాన పాత్రలో 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'. తాజాగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం.
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
ఈ సినిమాను ముందుగా థియేటర్లలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. కానీ ప్రస్తుతమున్న కరోనా పరిస్థితుల్లో థియేటర్లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. అందుకే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 15న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు. నరేష్, హరి చందన, జబర్దస్త్ రాంప్రసాద్, టీఎన్‌ఆర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జాతీయ అవార్డు గ్రహీత బిజిబాల్ సంగీతం అందించారు.