Jatiratnalu director-Sivakarthikeyan movie: 'జాతిరత్నాలు' డైరెక్టర్ అనుదీప్-తమిళ హీరో శివకార్తికేయన్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోశాప్క నటించబోతున్నట్లు సినీవర్గాల సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సింది. అంతకుముందు 'ఆర్ఆర్ఆర్' భామ ఒలీవియా మోరిస్‌ను తీసుకుందామని చిత్రబృందం భావించినట్లు వార్తలు వచ్చాయి.
శివకార్తికేయన్ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ భామ! - శివకార్తికేయన్ సినిమాలో మరియా ర్యబోశాప్క
Jatiratnalu director-Sivakarthikeyan movie: శివకార్తికేయన్ హీరోగా 'జాతిరత్నాలు' దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోయిన్గా ఓ హాలీవుడ్ భామ నటించబోతున్నట్లు ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?
![శివకార్తికేయన్ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ భామ! Sivakarthikeyan Jatiratnalu director movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14456074-thumbnail-3x2-siva.jpg)
శివకార్తికేయన్ సినిమాలో హీరోయిన్గా హాలీవుడ్ భామ
తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూకే నేపథ్య కథతో తీస్తున్నట్లు తెలుస్తోంది. తమన్ సంగీతమందిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర్ సినిమాస్, శాంతి టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇదీ చూడండి:బిగ్‌బాస్ సెట్లో అగ్నిప్రమాదం