తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యువ హీరోకు అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ - దిశా పటానీతో టైగర్ ష్రాఫ్ డేటింగ్

తనను​ పెళ్లి చేసుకోమని ఓ అభిమాని.. హీరో టైగర్ ​ష్రాఫ్​ను సోషల్ మీడియా వేదికగా కోరింది. దానికి అదే రీతిలో సమాధానం చెప్పాడు సదరు నటుడు. ఇంతకీ ఏం అన్నాడంటే?

UK-based fan asks Tiger Shroff to marry her
కథానాయకుడు టైగర్​ష్రాప్​

By

Published : Dec 12, 2020, 4:53 PM IST

బాలీవుడ్​ యువహీరో టైగర్​ ష్రాఫ్​కు యూకేకు చెందిన అభిమాని నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. దానికి ఈ కథానాయకుడు అంతే సున్నితంగా సమాధానమిచ్చాడు.

ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న టైగర్.. ఇన్​స్టాలో 'ఆస్క్ మీ ఎనీథింగ్' పేరుతో చాట్ సెషన్ పెట్టాడు. అందులో భాగంగానే యూకే అభిమాని ఒకరు తనను పెళ్లి చేసుకోమని, ఇక్కడికి వచ్చేయమని కోరింది. దానికి స్పందించిన ష్రాఫ్.. "ఇంకొన్ని ఏళ్లలో చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. ఎంతో సంపాదించాలి. అప్పటి వరకు నీకు మంచి స్నేహితుడిలా ఉంటా" అని సమాధానమిచ్చాడు.

హీరో టైగర్​ష్రాఫ్ ఇన్​స్టా స్టోరీ

హీరోయిన్​ దిశా పటానీతో టైగర్ ష్రాఫ్ డేటింగ్​ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయమై ఇద్దరిలో ఎవరూ మాట్లాడటం లేదు. ప్రస్తుతం ఇతడు 'భాఘీ 4', 'హీరోపంతి 2', 'గణపత్' సినిమాలు చేస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details