ప్లవనామ సంవత్సర ఉగాది పండగను పురస్కరించుకొని ఆయా చిత్రబృందాలు కొత్త పోస్టర్లను విడుదల చేశాయి. తమ హీరోహీరోయిన్లకు సంబంధించిన సరికొత్త లుక్‌ని పరిచేయం చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలియజేశాయి. 'పండగలు చాలా ఉంటాయి. కానీ, ప్రేమ ఒక్కటే' అంటూ 'రాధేశ్యామ్' నుంచి ప్రభాస్.. గుమ్మానికి పసుపు రాస్తూ 'విరాట పర్వం' నుంచి సాయి పల్లవి దర్శనమిచ్చారు. 'ఎఫ్ 3'.. మరో షెడ్యూల్ ప్రారంభమైంది అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ సందడి చేశారు.
ఉగాది వేళ.. టాలీవుడ్లో పోస్టర్ల మేళ! - ఆచార్య ఉగాది పోస్టర్
తెలుగు సంవత్సరాది ఉగాది పండగ సందర్భంగా పలు చిత్రబృందాలు తమ సినిమాల పోస్టర్లును విడుదల చేశాయి. అందులో ఏఏ చిత్రాల పోస్టర్లు ఉన్నాయో చూసేయండి.
ఉగాది వేళ.. టాలీవుడ్లో పోస్టర్ల మేళ!
అదే విధంగా 'గల్లీ రౌడీ', '101 జిల్లాల అందగాడు'.. తదితర చిత్రాల పోస్టర్లు విడుదలయ్యాయి. ఇంకా ఎవరెవరు ఎలా కనిపించారో చూసేయండి..
ఇదీ చూడండి:గ్లామర్ పాత్రలే కాదు.. నెగెటివ్ రోల్స్ చేయగలం!