తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రియా చక్రవర్తికి టాలీవుడ్​ నుంచి ఆఫర్లు? - రియా లేటేస్ట్ న్యూస్

సుశాంత్ మృతి కేసులో జైలుశిక్ష అనుభవించిన నటి రియా చక్రవర్తికి టాలీవుడ్​ను రెండు ఆఫర్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.

Two top Tollywood producers approach Rhea Chakraborty?
రియా చక్రవర్తికి టాలీవుడ్​ నుంచి ఆఫర్లు?

By

Published : Feb 7, 2021, 8:31 PM IST

బాలీవుడ్​ నటి రియా చక్రవర్తి వ్యక్తిగతంగా గతేడాది కఠిన పరిస్థితులను ఎదుర్కొంది. యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్​పూత్ మృతికి ఈమెనే కారణమని చాలామంది ఈమెపై ఆరోపణలు చేశారు. అనంతరం డ్రగ్స్ కేసులో రియాను అరెస్టు చేసిన చేసిన పోలీసులు ఆమె సోదరుడిని కూడా జైలులో పెట్టారు. అనంతరం కొన్నాళ్లకు బెయిల్​పై ఆమె విడుదలైంది.

ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్​ దర్శకనిర్మాతలు ఎవరూ ఆఫర్లు ఇచ్చేలా కనిపించడం లేదు. అలా చేస్తే బహుశా తమ సినిమాపై సుశాంత్ అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని వారు భావిస్తున్నారేమో! అయితే టాలీవుడ్​కు చెందిన ఇద్దరు అగ్రనిర్మాతలు మాత్రం రియాను సంప్రదించినట్లు తెలుస్తోంది. వాళ్లు ఎవరనేది బయటక తెలియనప్పటికీ ఆ అంశం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది.

నటి రియా చక్రవర్తి

2012లో తెలుగులో వచ్చిన 'తూనీగ తూనీగ' సినిమాతోనే హీరోయిన్​గా అరంగేట్రం చేసింది రియా. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది చదవండి:సుశాంత్ సింగ్​తో పాటు రియా చక్రవర్తి బయోపిక్‌!

ABOUT THE AUTHOR

...view details