తెలంగాణ

telangana

మ్యాస్ట్రో ఇళయరాజా.. 10 నిమిషాల్లో రెండు ట్యూన్స్

By

Published : Dec 30, 2019, 2:02 PM IST

'రంగమార్తాండ' సినిమా కోసం 10 నిమిషాల్లో రెండు పాటలకు స్వరాలు సమకూర్చాడు మ్యాస్ట్రో ఇళయరాజా. ఈ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు దర్శకుడు కృష్ణవంశీ.

మ్యాస్ట్రో ఇళయరాజా.. 10 నిమిషాల్లో రెండు ట్యూన్స్
రంగమార్తాండ-రమ్యకృష్ణ-ఇళయరాజా

'రంగమార్తాండ' షూటింగ్​లో బిజీగా ఉన్నాడుదర్శకుడు కృష్ణవంశీ. మరాఠీ హిట్​ 'నటసామ్రాట్'కు రీమేక్ ఇది. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నాడు. అయితే మ్యూజిక్ సిట్టింగ్స్​కు సంబంధించిన ఓ వీడియోను సోమవారం ట్వీట్ చేశాడీ డైరెక్టర్. ఇందులో కేవలం 10 నిమిషాల్లోనే రెండు పాటలకు ట్యూన్స్​ కట్టాడు ఇళయరాజా.

ఇందులో ప్రకాశ్​రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, 'బిగ్​బాస్ 3' ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, శివాత్మిక తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

ఇది చదవండి: బ్రహ్మానందం.. 'రంగమార్తాండ'లో మనసుకు హత్తుకునే పాత్రలో

ABOUT THE AUTHOR

...view details