తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్నికలు ముగిశాయి.. సినిమాలు వస్తున్నాయి - 2019 ఎన్నికలు

నేడు రెండు సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని పలకరించనున్నాయి. సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి', మోహన్​లాల్ హీరోగా నటించిన మలయాళ అనువాద చిత్రం 'లూసిఫర్'..ఈ జాబితాలో ఉన్నాయి.

ఎన్నికల ముగిశాయి..సినిమాలు వస్తున్నాయి

By

Published : Apr 12, 2019, 6:00 AM IST

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక ప్రజలను ఆకట్టుకునేందుకు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఆ క్రమంలో నేడు రెండు సినిమాలు వస్తున్నాయి. ఒకటి సాయిధరమ్ తేజ్ 'చిత్రలహరి', మరొకటి మోహన్​లాల్ 'లూసిఫర్'. ఈ రెండు చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుందో చూడాల్సిందే.

ఫ్లాపుల నుంచి మెగా హీరో 'తేజ్' గట్టేక్కేనా..!

వరుసగా ఆరు ఫ్లాపులు... ఈ సమయంలో ఏ నిర్మాత లేదా దర్శకుడైన ఆ హీరోతో సినిమా చేయాలంటే ఆలోచిస్తారు. కానీ తనను తాను పూర్తిగా మార్చుకుని సరికొత్తగా వస్తున్నాడు సాయిధరమ్ తేజ్. సరికొత్త ప్రేమకథ 'చిత్రలహరి'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఈ చిత్రానికి దర్శకుడు కిశోర్ తిరుమల. కల్యాణి ప్రియదర్శన్, నివేది పేతురాజ్ హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్...అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

మలయాళ హీరో ఇక్కడ మెరిసేనా..

జనతా గ్యారేజ్, మన్యం పులి చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు మోహన్​లాల్. మలయాళంలో సూపర్​హిట్ అయిన 'లూసిఫర్'​ను అదే పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మలయాళంలో విడుదలైన 8 రోజుల్లోనే రూ.100 కోట్లు సాధించింది ఈ సినిమా. అత్యంత వేగంగా ఆ మైలురాయిని చేరుకున్న చిత్రంగా నిలిచింది. మంజూ వారియర్, వివేక్ ఒబెరాయ్ ఇతర పాత్రలో నటించారు. మరి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details