తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మోదీ యోగ ముద్రపై ట్వింకిల్​ ఖన్నా సెటైర్..! - యోగ ముద్రలో ఉన్న మోదీ ఫొటో

కేదార్​నాథ్​లో ప్రధాని నరేంద్ర మోదీ వేసిన యోగ ముద్రపై.. సినీ నటుడు అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్​ ఖన్నా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. సంబంధిత ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

మోదీ యోగ ముద్రపై ట్వింకిల్​ ఖన్నా సెటైర్

By

Published : May 20, 2019, 7:35 PM IST

Updated : May 20, 2019, 8:18 PM IST

ఇటీవలే కేదార్​నాథ్​ను సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ.. యోగ ముద్రలో ధ్యానం చేశారు. ఈ ఫొటోలు విడుదల చేయగానే నెటిజన్లు విపరీతంగా స్పందించారు. నెట్టింట్లో ఈ ఫొటోపై మీమ్​లు ఎక్కువగా దర్శనమిచ్చాయి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్​ సతీమణి ట్వింకిల్ ఖన్నా.. మోదీని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఓ ఫొటోను ట్విట్టర్​లో పోస్టు చేసింది.

"అంతర్జాలంలో ఈ మధ్య ఆధ్యాత్మికతకు సంబంధించిన ఫొటోలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ మెడిటేషన్​ ఫొటోగ్రఫి.. ఫోజులు, యాంగిల్స్​ ప్రయత్నిస్తున్నాను. ఈ ఫోటో సెషన్ వెడ్డింగ్ ఫోటోగ్రఫి కంటే బాగుంది." -ట్విట్టర్​లో ట్వింకిల్​ ఖన్నా

ఈ ట్వీట్​పై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు. రీట్వీట్​లు చేస్తున్నారు. ఇప్పుడే కాదు చాలా సార్లు మోదీపై ఆమె విమర్శలు గుప్పించింది.

ఇటీవల ప్రధాని మోదీ.. అక్షయ్ కుమార్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ముఖాముఖిలో మోదీ ట్వింకిల్ ఖన్నా గురించి ప్రస్తావించడం విశేషం.

Last Updated : May 20, 2019, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details