తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లైవ్​లో కన్నీళ్లు పెట్టుకున్న రష్మి.. కారణం అదేనా!

కరోనా ప్రభావంతో మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారిందని బుల్లితెర వ్యాఖ్యాత, నటి రష్మీ గౌతమ్​ తెలిపింది. లాక్​డౌన్​ వల్ల పనులు లేక కూలీలు ఆహారం కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారని వెల్లడించింది. మూగజీవాలూ ఆహారం దొరక్క మృత్యువాత పడుతున్నాయని కన్నీటి పర్యంతమైంది.

TV show Anchor and Actress rashmi gowtham sincere request to her followers
లైవ్​లో కన్నీళ్లు పెట్టుకున్న రష్మి.. కారణం అదేనా!

By

Published : Mar 31, 2020, 7:13 PM IST

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ విధించడం వల్ల మూగజీవాల పరిస్థితి దయనీయంగా తయారైందని ప్రముఖ వ్యాఖ్యాత, నటి రష్మీ గౌతమ్‌ కన్నీటి పర్యంతమైంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నప్పటికీ ఆహారం దొరక్క వందల మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని పేర్కొంది. ఈ విషయంపై ఆమె సోషల్​ మీడియాలో మాట్లాడుతూ లైవ్‌లో కన్నీరు పెట్టుకుంది. రోజు వారి కూలీలు, పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. చాలా మంది సమయానికి తిండి తినడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

వీధుల్లో కుక్కలు, ఆవులు ఆహారం దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని తెలిపింది. మానవతా దృక్పథంతో ప్రజలంతా వీధి శునకాలు, పిల్లులు ఇతర జీవాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజారోగ్యానికి ఆర్థిక సాయం చేసినట్లుగానే.. మూగజీవాల కోసం పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తోచినంత సాయం చేయాలని ఆమె కోరింది. ఒక్క రూపాయి ఇచ్చినా.. అది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పింది.

మూగజీవాలకు ఆహారాన్ని సిద్ధం చేసిన ఫొటో

రష్మి తన ప్రాంతానికి దగ్గర ఉన్న కొన్ని శునకాలకు స్వయంగా ఆహారం పెట్టింది. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను, వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. సోమవారం రష్మి పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.25 వేలు విరాళంగా ప్రకటించింది. అదేవిధంగా ఆకలితో ప్రాణాలు కోల్పోతున్న మూగజీవాల కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇచ్చినట్లు ట్వీట్‌ చేసింది.

ఇదీ చూడండి.. కరోనాపై పోరులో మేముసైతం అంటోన్న తారలు

ABOUT THE AUTHOR

...view details