తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కిడ్నీ సమస్యతో టీవీ నటి మృతి - కిడ్నీ సమస్యతో నటి లీనా ఆచార్య మృతి

బుల్లితెర నటి లీనా ఆచార్య.. కిడ్నీ సమస్యతో బాధపడుతూ మరణించారు. ఈమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

leena acharya
లీనా ఆచార్య

By

Published : Nov 22, 2020, 5:46 PM IST

ఈ ఏడాది వరుసగా నటీనటుల మరణాలు అభిమానులను కుంగదీస్తున్నాయి. బాలీవుడ్​లో బుల్లితెర నటి లీనా ఆచార్య కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతూ, శనివారం మృతి చెందారు. 30 ఏళ్ల వయసులోనే ఈమె మరణించడం సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీప్రముఖులు ఈమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

ఏడాది కాలం నుంచి ఆచార్య, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కొంతకాలం క్రితం రెండు కిడ్నీలు పాడవడం వల్ల తన తల్లి ఓ కిడ్నీను ఈమెకు దానం చేశారు. అయినా సరే ఫలితం లేకుండా పోయింది. దీంతో లీనా మృతిచెందారు.

లీనా ఆచార్య

మోడల్​గా కెరీర్​ ప్రారంభించిన లీనా.. పలు ధారావాహికల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 'సేట్‌జీ', 'ఆప్ కే ఆ జానే సే', మేరీ హానీ కారక్ బీవీ' లాంటి​ సీరియల్స్​ ఈమెకు పేరు తెచ్చిపెట్టాయి. చివరగా 'క్లాస్ ఆఫ్ 2020' వెబ్​సిరీస్​లో నటించారు.

ఇదీ చూడండి : కొంపముంచిన డైటింగ్.. కిడ్నీ ఫెయిల్యూర్​తో నటి మృతి

ABOUT THE AUTHOR

...view details