బాలీవుడ్ చిత్రం 'తుంబాడ్' గతేడాది ఫిల్మ్‌ఫేర్‌లో దాదాపు మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం పంచుకుంది అమెజాన్ ప్రైమ్. ఈ చిత్రాన్ని తీయడానికి దాదాపు 6 సంవత్సరాలు పట్టినట్లు చెప్పింది.
సినిమాలో తుంబాడ్ పట్టణంలో నిరంతరం వర్షం కురుస్తూనే ఉంటుంది. అలా వర్షం సీన్లు రియల్‌గా ఉండాలని.. దాదాపు 4 వర్షాకాలాల్లో సినిమా చిత్రీకరించారట.
ఈ సినిమా 64వ ఫిల్మ్‌ఫేర్‌లో ఉత్తమ సౌండ్ డిజైన్ (కునాల్ శర్మ), ఉత్తమ సినిమాటోగ్రఫీ (పంకజ్ కుమార్), ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (నితిన్ జిహానీ చౌదరి, రాజేష్ యాదవ్) విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది.
అదే సమయంలో ఉత్తమ చిత్రంగా రాజీ, ఉత్తమ చిత్రంగా(క్రిటిక్) అంధాధున్ ఎంపికయ్యాయి. అయితే తుంబాడ్, అంధాధున్ చిత్రాలు ఆస్కార్ రేంజ్ అని... రెండింటిలో అగ్రనటీనటులు లేకపోయినా.. పురస్కారాలు, విమర్శకుల మన్ననలు పొందడమే ఇందుకు నిదర్శనమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇదీ చూడండి:షార్క్‌తో స్విమ్మింగ్ చేసిన కత్రినా కైఫ్