తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'టక్ జగదీష్' ఓటీటీలోనే.. వినాయక చవితి కానుకగా రిలీజ్ - లేటెస్ట్ movie news

ఎట్టకేలకు 'టక్ జగదీష్' విడుదలకు రంగం సిద్ధమైంది. వినాయక చవితి కానుకగా ఓటీటీలో సెప్టెంబరు 10 నుంచి ప్రేక్షకుల అందుబాటులోకి రానుంది.

Tuck Jagadish OTT release date
టక్ జగదీష్ సినిమా

By

Published : Aug 27, 2021, 2:37 PM IST

నేచురల్ స్టార్ నాని 'టక్ జగదీష్' సినిమా.. ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు చేసుకుంది. అందరూ అనుకున్నట్లు ఓటీటీలోనే సెప్టెంబరు 10న విడుదల కానుంది. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా నాని సరసన రీతూవర్మ హీరోయిన్​గా చేసింది. జగపతిబాబు, ఐశ్వర్యరాజేశ్​ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించగా, శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.

ఈ సినిమా విషయమై ఇటీవల తెలుగు నిర్మాతల మండలి, హీరో నాని మధ్య వివాదం జరిగింది. చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్​ చేస్తే, సదరు కథానాయకుడు తర్వాత చేసే ఏ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేయనివ్వమంటూ వ్యాఖ్యనించారు. ఆ తర్వాత ఈ విషయం కాస్త చర్చనీయాంశం కావడం వల్ల నానికి, నిర్మాతల మండలి క్షమాపణలు చెప్పింది.

నాని 'టక్ జగదీష్'

అదే రోజు మూడు సినిమాలు!

సెప్టెంబరు 10వ తేదీనే నాగచైతన్య-సాయిపల్లవి 'లవ్​స్టోరి' థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఓటీటీలో 'టక్ జగదీష్​' తీసుకొస్తున్నట్లు తెలిపారు. అయితే వీటితో పాటు నితిన్ 'మాస్ట్రో' చిత్రాన్ని అదేరోజు ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details