నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టక్ జగదీష్'. ఈ సినిమా నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చిత్రానికి క్లాప్‌నిచ్చారు. అనంతరం కొన్ని ముహూర్తపు సన్నివేశాలు చిత్రీకరించారు.
పట్టాలెక్కిన నేచురల్ స్టార్ 'టక్ జగదీష్' - నాని, దర్శకుడు శివ సినిమా
నేచురల్ స్టార్ నాని కొత్త ప్రయోగం పట్టాలెక్కింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'టక్ జగదీష్' చిత్రం నేడు(గురువారం) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెగ్యులర్ చిత్రీకరణ ఫిబ్రవరి 11 నుంచి మొదలవనుంది.
పట్టాలెక్కిన నేచురల్ స్టార్ 'టక్ జగదీష్'
ఇంతకుముందు నాని, శివ నిర్వాణ కలయికలో 'నిన్ను కోరి' వచ్చి మంచి విజయం సాధించింది. 'టక్ జగదీష్'కు షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారాపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 11 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇదీ చదవండి: సామాజిక అంశాలే ప్రధానంగా తాప్సీ కొత్త చిత్రం
Last Updated : Feb 28, 2020, 12:46 PM IST