*'టక్ జగదీష్' ట్రైలర్ ఇప్పటికే అలరిస్తుండగా.. 'టక్ సాంగ్' పాటతో ఆకట్టుకునేందుకు చిత్రబృందం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ గీతాన్ని రిలీజ్ చేయనున్నారు. కుటుంబ కథతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబరు 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.
*ఆది పినిశెట్టి 'క్లాప్' సినిమా అప్డేట్ వచ్చేసింది. టీజర్‌ను సెప్టెంబరు 6న రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆది, రన్నర్‌గా కనిపించనున్నారు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్నారు.