అతి త్వరలోనే సినిమా చిత్రీకరణల అనుమతులకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేయబోతున్నట్లు తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి.కల్యాణ్ స్పష్టం చేశారు. దర్శక, నిర్మాతలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందులో మార్గదర్శకాలుంటాయని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు విడుదల చేసిన ఉత్తర్వులను పరిశీలిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్లు చేయడం అసాధ్యమని చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం సామరస్యపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణలో త్వరలో సినిమా షూటింగ్లు! - తెలంగాణలో సినిమా చిత్రీకరణలు
తెలంగాణ ప్రభుత్వం, చిత్రీకరణల అనుమతి కోసం తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు తయారు చేస్తోందని, త్వరలో దీనిని జారీ చేయనున్నట్లు నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు.
సినిమా షూటింగ్ నిర్మాత సి.కల్యాణ్
తలసాని ట్రస్టు ఆధ్వర్యంలో, ఫిల్మ్ ఛాంబర్లో పలువురు పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి.కల్యాణ్, అభిషేక్ అగర్వాల్, తలసాని సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే తలసాని కుటుంబం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రకటించారు.