తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేను కన్న ఏకైక కల ఇదే: విద్యాబాలన్​ - విద్యావాలన్​ తాజా వార్తలు

బాలీవుడ్​ హీరోయిన్​ విద్యాాబాలన్​ తన సినీ కెరీర్​రో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

vidya balan news
విద్యాబాలన్​

By

Published : Aug 3, 2020, 7:33 PM IST

Updated : Aug 3, 2020, 7:41 PM IST

తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసి.. అందంతో అభిమానుల మనసు దోచేసింది బాలీవుడ్​ హీరోయిన్​ విద్యా బాలన్​. సినీ కెరీర్​ ప్రారంభం నుంచి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొంది. తనకంటూ ప్రత్యేకతను చాటుకొని వెండితెర ప్రయాణంలో.. ఇప్పటికి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆన్​లైన్​ వేదికగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకాభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది విద్య.

నటి కావాలన్న తన ఏకైక కల నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఈ క్రమంలోనే తన కెరీర్​ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

"అవును. నా ప్రయాణంలో కొన్ని ఒడుదొడుకులు, సవాళ్లు ఉన్నాయి. వాటి నుంచే పాఠాలు నేర్చుకున్నా. కొన్ని సార్లు నేను అనుకున్న స్థాయికి చేరుకున్నట్లు అనిపిస్తుంది. ఈ నటనకే నా జీవితాన్ని అంకితం చేస్తాను. మిగిలిన కాలం కూడా ఇలాగే గడిపేస్తా".

విద్యా బాలన్​, సినీ నటి.

'పరినీత' సినిమాతో బాలీవుడ్​లో అరంగేట్రం చేసిన విద్యాబాలన్​.. 'ద డర్టీ పిక్చర్'​తో బ్లాక్​బాస్టర్​ ​అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలూ పొందింది. తాజాగా హ్యూమన్​ కంప్యూటర్​ 'శకుంతల దేవి' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రంలోనూ నటించింది. జులై 30న ఆన్​లైన్​ స్ట్రీమింగ్​ అమెజాన్​లో విడుదలైన ఈ సినిమాకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Last Updated : Aug 3, 2020, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details