బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో స్పందించిన నిర్మాత ఏక్తా కపూర్.. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, సుశాంత్ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉండనివ్వాలని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
"సుశాంత్‌కు అవకాశాలివ్వలేదని నాపై కేసు పెట్టినందుకు ధన్యవాదాలు.. నిజానికి అతడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే. ఇలాంటి ఆరోపణలు ఎలా వచ్చాయో తెలియడం లేదు. ప్రస్తుతం సుశాంత్ కుటుంబం, స్నేహితులను ప్రశాంతంగా బాధపడనివ్వండి. నిజం ఎప్పటికైనా నిలబడుతుంది. దీనినే నమ్మండి"