తన అందంతో వెండి తెరమీద మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ అభిమానుల్ని అలరిస్తుంటుంది బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ. సరికొత్త డిజైన్స్‌తో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా ఓ ట్రెండీ లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది. పీచులా ఉన్న పసుపు రంగు వస్త్రాన్ని ధరించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
కియారా వేసుకున్న ఈ డ్రెస్ పేరు తెలుసా..? - bollywood
బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ వేసుకున్న డ్రెస్‌కు నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది. మ్యాగీ డ్రెస్ బాగుందంటూ నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు.
ఆ డ్రెస్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ కారణంగా అభిమానులు తమకు నచ్చిన పేర్లు సూచిస్తున్నారు. "మ్యాగీ డ్రెస్ చాలా బావుంది. మీకు మ్యాగీ ఇష్టం. అందుకే ఇలా మ్యాగీ గౌను డిజైన్ చేయించారా? మసాలా మ్యాగీ" అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పెట్టారు. వాటికి కియారా కూడా సరదాగా సమాధానం ఇచ్చింది. "అంతేకాదు ఇలా రెడీ అయ్యేందుకు కేవలం రెండు నిమిషాల సమయమే పట్టింది." అంటూ ఛలోక్తి విసిరింది. అలా కియారా వేసుకున్న గౌను 'మ్యాగీ' డ్రెస్ అయ్యింది.
ఇవీ చూడండి.. రేపు ట్రైలర్‌తో రానున్న 'వాల్మీకి'