తెలుగులో 'దేవదాసు' చిత్రంతో యువకుల మనసు దోచిన నటి ఇలియానా. ఈమధ్య కాలంలో సామాజిక మాధ్యమాల్లో కుర్రకారుకి కిర్రెక్కించే ఫొటోలు పెడుతూ తెగ హల్‌చల్ చేస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న ఈ ఫోజులపై కొందరు అభిమానుల ప్రశ్నలకు ఈ సన్న నడుము సుందరి స్పందించింది.
"ఇవి నిజంగా నీ ఫొటోలేనా లేక ఫొటోషాప్ చేసి పెడుతున్నావా?" అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి ఇలియానా జవాబిస్తూ.."ఫొటో షాప్ చేసిన ఫొటోలను నేనెప్పుడూ పెట్టను. అలాంటి పనులు నాకిష్టం ఉండదు. అలా పెడితే మన వ్యక్తిత్వం ఏముంటుంది. మనసుకు నచ్చిన పని చేయాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటారని భయపడాల్సిన పనిలేదు" అని చెప్పింది.