యంగ్‌టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో కొత్త సినిమా ప్రకటించి దాదాపుగా ఎనిమిది నెలలు పూర్తయ్యింది. తారక్ ప్రస్తుతం రాజమౌళి చిత్రంలో నటిస్తూ బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కలేదు. ఈ విరామ సమయంలో త్రివిక్రమ్ మరో హీరోతో త్వరలోనే ఈ సినిమా రూపొందించబోతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి.
తారక్-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఖరారు! - ఫిబ్రవరిలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ప్రారంభం
ఫిబ్రవరిలో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందున్న చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఇప్పటికే పూర్తయ్యిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
తారక్-త్రివిక్రమ్ సినిమాకు ముహూర్తం ఖరారు!
అయితే కొత్త ప్రాజెక్టు ప్రారంభించాలనే యోచన త్రివిక్రమ్‌కు లేదని సమాచారం. ఫిబ్రవరి నుంచి తారక్‌తో సినిమా చిత్రీకరణ ప్రారంభించిననున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్‌తో కలిసి హారికా, హాసిని క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించనుంది.