టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ఈ ఏడాది ఆయన దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం దక్కించుకుంది. ఈ సినిమా అటు అల్లు అర్జున్, ఇటు త్రివిక్రమ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ మాటల మాంత్రికుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే 'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత త్రివిక్రమ్ తన రెమ్యునరేషన్‌ను పెంచినట్లు సమాచారం.
రెమ్యునరేషన్ పెంచేసిన మాటల మాంత్రికుడు! - trivikram new movie updates
టాలీవుడ్ అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ఈ ఏడాది విడుదలైన 'అల వైకుంఠపురములో' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం మాటల మాంత్రికుడు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
రెమ్యునరేషన్ పెంచేసిన మాటల మాంత్రికుడు!
ఎన్టీఆర్‌తో తీయబోయే చిత్రం కోసం త్రివిక్రమ్ భారీగా పారితోషికం తీసుకుంటున్నారని టాక్. ఏకంగా 20 కోట్లకు తన రెమ్యునరేషన్ పెంచేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇంతకుముందు 10-15 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు త్రివిక్రమ్.