'జాతిరత్నాలు' ఫేం నవీన్ పొలిశెట్టి(jathi ratnalu naveen polishetty) కొత్త సినిమా ఖరారైంది. నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్మెంట్స్(naveen polishetty sitara entertainment), ఫార్చూన్4సినిమాస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాయి. ఈ విషయాన్ని సదరు నిర్మాణ సంస్థలు ట్వీట్ చేశాయి. నవీన్ పొలిశెట్టిని కొత్తగా చూపించబోతున్నట్లు వెల్లడించాయి. కాగా, ఫార్చూన్4సినిమాస్‌తో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నారు దర్శకుడు త్రివిక్రమ్.
మహేశ్-త్రివిక్రమ్ నిర్మాతలుగా నవీన్ పొలిశెట్టి సినిమా - Trivikram-Naveen Polishetty film
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో కొత్త సినిమా చేసేందుకు హీరో నవీన్ పొలిశెట్టి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ చిత్రాన్ని ఫార్చూన్ 4సినిమాస్‌తో(దర్శకుడు త్రివిక్రమ్‌ది) కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీకి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించనున్నారు.
మహేశ్
ఈ మూవీకి కల్యాణ్‌శంకర్ దర్శకుడిగా వంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. కామెడీ నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. నవీన్.. ఈ మూవీతో పాటు హీరోయిన్ అనుష్కతో(anushka naveen polishetty movie) ఓ సినిమా, యూవీ క్రియేషన్స్ బ్యానర్లో మరో చిత్రం చేయనున్నట్లు కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఇదీ చూడండి: రూ.4కోట్ల రెమ్యునరేషన్ తిరిగిచ్చిన నవీన్ పొలిశెట్టి!