తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మిస్​ మ్యాచ్'​ చాలా కొత్తగా ఉంది: త్రివిక్రమ్​ - త్రివిక్రమ్​ తాజా సినిమా

'సలీం​' సినిమా దర్శకుడు నిర్మల్​ కుమార్​ తెరకెక్కించిన మరో చిత్రం 'మిస్​ మ్యాచ్'. ఇందులోని మొదటి పాటను దర్శకుడు త్రివిక్రమ్ విడుదల చేశాడు. మూవీ పేరు కొత్తగా ఉందని,  విజయవంతం కావాలని ఆకాంక్షించాడు.

'మిస్​ మ్యాచ్'​ చాలా కత్తగా ఉంది

By

Published : Nov 25, 2019, 1:11 PM IST

'మిస్​ మ్యాచ్'​ చాలా కత్తగా ఉంది

ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం 'మిస్ మ్యాచ్'. ఈ మూవీలోని తొలి పాటను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్​ విడుదల చేశాడు.

సినిమా పేరు కొత్తగా ఉందంటూ చిత్ర బృందాన్ని అభినందించాడు త్రివిక్రమ్​. 'మిస్​ మ్యాచ్'​ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు. 'సలీం' సినిమా వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన నిర్మల్​ కుమార్​ తెరకెక్కించిన ఈ చిత్రం సెన్సార్​ పూర్తిచేసుకుని డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవీ చూడండి.. ప్రేమికులకు సర్​ప్రైజ్​ ఇచ్చే ఆ ప్రేమికుడెవరో...?

ABOUT THE AUTHOR

...view details