తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాటల మాంత్రికుడి బహుమతి కాస్త భిన్నం! - #HBDpawankalyan

పవర్​స్టార్ పవన్​కల్యాణ్​కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు దర్శకుడు త్రివిక్రమ్. జనసేనాని కోసం అతడు తయారు చేయించిన కేక్​ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది.

మాటల మాంత్రికుడి బహుమతి కాస్త డిఫరెంట్​..!

By

Published : Sep 3, 2019, 11:39 AM IST

Updated : Sep 29, 2019, 6:39 AM IST

సోమవారం పుట్టినరోజు జరుపుకున్నాడు పవర్​స్టార్ పవన్​కల్యాణ్. సాధారణ ప్రజల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ అతడికి శుభాకాంక్షలు చెప్పారు. సోషల్​ మీడియాలో #HBDpawankalyan అనే హ్యాష్​టాగ్​ ట్రెండింగ్​లో నిలిచింది. అయితే అందరి కంటే కాస్త విభిన్నంగా విషెస్​ చెప్పాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అతడితో పాటు నిర్మాత వంశీ.. ఓ కేకును ప్రత్యేకంగా డిజైన్​ చేయించి పవన్​కు బహుమతిగా ఇచ్చారు.

దర్శకుడు త్రివిక్రమ్​ బహుమతిగా ఇచ్చిన కేక్ ఫొటో

ఆధునిక భారతం అనే పుస్తకం, ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి, చేగువేరా ఫొటో, జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ ఆకృతులతో రూపొందించిన ఈ కేక్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో 'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి' చిత్రాల్లో నటించాడు పవన్​కల్యాణ్.

ఇది చదవండి: పండుగరోజు పంచెకట్టులో మామ- అల్లుడు

Last Updated : Sep 29, 2019, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details