తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పింక్‌'లో త్రివిక్రమ్‌ పెన్ను పెట్టట్లేదట..! - త్రివిక్రమ్ పవన్ కల్యాణ్

'పింక్' రీమేక్​లో పవర్ స్టార్ నటిస్తున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు ఈ సినిమా అప్​డేట్స్ గురించి ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది.

పింక్‌
పింక్‌

By

Published : Jan 7, 2020, 2:55 PM IST

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీ చిత్రం 'పింక్‌' రీమేక్‌పై సినీ ప్రియుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనిపై పవన్‌ నోటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, తెర వెనుక పనులు మాత్రం శరవేగంగా జరిగిపోతున్నాయి. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం నిర్మాత దిల్‌రాజు ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులను పూర్తి చేసేశాడు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫిబ్రవరి తొలి వారం నుంచి పవన్‌ ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాకు స్క్రీన్‌ ప్లే, సంభాషణలను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ రాయబోతున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చాయి. పవన్‌తో ఉన్న స్నేహ బంధాన్ని దృష్టిలో ఉంచుకుని త్రివిక్రమ్ ఈ పనిని చేసిపెడుతున్నట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం మాటల మాంత్రికుడు ఈ చిత్ర స్క్రిప్ట్‌లో తన కలం పెట్టలేదనే తెలుస్తోంది. ఈ చిత్ర స్క్రీన్‌ ప్లే, సంభాషణల్ని శ్రీరామే స్వయంగా రాసుకున్నాడట. ఇప్పటికే ఈ పనులన్నీ పూర్తయ్యాయని, పవన్‌కు వాటిని వినిపించడమే మిగిలి ఉందని సమాచారం.

ఇవీ చూడండి.. సర్‌ప్రైజింగ్‌.. 'సరిలేరు..'లో కృష్ణ లుంగీ డ్యాన్స్‌..!

ABOUT THE AUTHOR

...view details