తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చిరుకు నో చెప్పిన త్రిష- ఇది రెండో గుడ్​బై!

ప్రముఖ హీరోయిన్​ త్రిష 'ఆచార్య' సినిమా నుంచి వైదొలిగింది. క్రియేటివ్​ భిన్నాభిప్రాయాల నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు ట్విట్టర్​ వేదికగా వెల్లడించిందీ అందాల నటి. మెగాస్టార్​ చిరంజీవితో కలిసి ఈ చిత్రంలో నటించాల్సింది. గతంలోనూ ఇదే తరహాలో 'సామీ 2' సినిమా నుంచి తప్పుకుంది.

Trisha Stepout from the Chirajeevi 152 film due to creative diffrences as like saamy 2?
మెగాస్టార్​ ఆఫర్​ను తిరస్కరించిన త్రిష.. ఆచార్యకు గుడ్​బై

By

Published : Mar 13, 2020, 8:49 PM IST

Updated : Mar 14, 2020, 6:24 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 'ఆచార్య' సినిమా నుంచి హీరోయిన్ త్రిష తప్పుకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా త్రిషను ఎంచుకున్నారు. అయితే ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు ఆమె శుక్రవారం సాయంత్రం స్పష్టం చేసింది.

కథానాయిక త్రిష

" కొన్ని విషయాలు తొలుత చెప్పినట్లు, చర్చించుకున్నట్లు కాకుండా విభిన్నంగా మారుతుంటాయి. క్రియేటివ్‌ అంశంలో భిన్నాభిప్రాయాల వల్ల చిరంజీవి సర్‌ సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నా. చిత్ర బృందానికి నా అభినందనలు. తెలుగు ఆడియన్స్‌.. మరొక మంచి ప్రాజెక్టుతో మిమ్మల్ని త్వరలోనే కలుస్తానని ఆశిస్తున్నా"

-- త్రిష ట్వీట్​

చిరు-త్రిష కలిసి ‘స్టాలిన్‌’ సినిమాలో నటించారు. 2006లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్‌ అందుకుంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత చిరు-త్రిష కాంబినేషన్‌ రాబోతోంది అనగానే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరోసారి వీరి జోడీని వెండితెరపై చూస్తామని సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆమె సినిమా నుంచి తప్పుకొంది.

గతంలోనూ ఇదే తరహాలో...

విక్రమ్​ నటించిన 'సామీ 2'లో తొలుత త్రిష కథానాయికగా ఎంపికైంది. అయితే క్రియేటివిటీ అంశంలో అభిప్రాయాలు కుదరక తప్పుకుంటున్నట్లు ప్రకటించిందీ అందాల భామ. ఫలితంగా ఈ సినిమాలో కీర్తి సురేశ్​ నటించింది.

ప్రస్తుతం త్రిష చేతిలో 'పరమపదం విలయాట్టు', 'రాంగీ', 'గర్జనై', 'రామ్‌', 'పొన్నియిన్‌ సెల్వన్‌' ప్రాజెక్టులు ఉన్నాయి.

త్రిష రెండు ట్వీట్లు

ఇదీ చదవండి..

Last Updated : Mar 14, 2020, 6:24 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details