గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో త్రిష నటిస్తుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. గౌతమ్ ఓ లఘు చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నడని సమాచారం. ప్రధాన పాత్ర కోసం త్రిషను ఎంపిక చేశారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ముచ్చటగా మూడోసారి ఆ దర్శకుడితో త్రిష! - గౌతమ్ మీనన్ తెరకెక్కించబోయే లఘుచిత్రంలో త్రిష
దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించబోయే లఘుచిత్రంలో త్రిష నటించనుందని టాక్. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
మూడోసారి ముచ్చటగా ఆ దర్శకుడుతో త్రిష!
గతంలో గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాల్లో నటించింది త్రిష. 'విన్నైతాండి వరువాయ', 'ఎన్నై అరిన్‌దల్' సినిమాలు ఘన విజయం అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటం వల్ల అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కిస్తున్న 'ఆచార్య' నుంచి ఇటీవల త్రిష తప్పుకుంది. మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో నటిస్తుంది.